Skip to main content

తొలి అయిదేశ్లు.. వదలొద్దు ఆ లేత వేళ్లు!



తొలి అయిదేశ్లు.. వదలొద్దు లేత వేళ్లు!
పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి
బుజ్జాయిల పెంపకంలో ఇదే కీలకం
మానసిక, శారీరక ఎదుగుదలకు ముఖ్యం
చిన్నారుల్లో నేర ప్రవృత్తికి అప్పుడే అడ్డుకట్ట

రోజురోజుకూ పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి పరిసరాల ప్రభావమే కాదు... చిన్నప్పటి నుంచి వారి పెంపకంలోని లోపాలు... నిర్లక్ష్యం దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. నేపథ్యంలో పిల్లల పెంపకం సవాలుగా మారుతోంది. రెండింటినీ సమన్వయం చేసుకోలేక పోతున్నారు. ప్రభావం చివరికి బుజ్జాయిలపై పడుతోంది. మరోవైపు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై... స్థానంలో చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం పెరిగింది. పరిణామంతో పిల్లల పెంపకం కత్తి మీద సాములా మారింది. దీనికితోడు వృత్తి, వ్యక్తిగత ఒత్తిళ్లు పిల్లల పెంపకంపై పడి... వారి మానసిక, శారీరక ఎదుగుదలకు ప్రతికూలంగా మారుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి.
నగర జీవితం ఉరుకులు పరుగులమయం. నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయంతో భార్యాభర్తలు ఉద్యోగాలు చేయనిదే ఇల్లు గడవని పరిస్థితి. చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో మరీ కష్టంగా గడుస్తుంది. పెద్దవారు తోడుంటే సరేసరి. లేదంటే డేకేర్సెంటర్లలో ఉంచి ఉద్యోగాలకు వెళుతున్నారు. సాయంత్రానికి తిరిగి వచ్చినా... బాగా అలసిపోయి ఉండటం వల్ల వారికి సరైన సమయం కేటాయించలేక పోతున్నారు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన నాటి నుంచి అయిదేళ్ల వరకు కీలక దశ. మానసిక, శారీరక ఎదుగుదలకు దశ ఎంతో అవసరం. తల్లిదండ్రుల పాత్ర మరింత ముఖ్యమైనది. ఉద్యోగ బాధ్యతల కారణంగా స్థితిలో చిన్నారులకు చాలామంది తల్లిదండ్రులు దూరమవుతున్నారు. బరువు, బాధ్యతల్లో పడి ఆలనా పాలనా ఇతరుల చేతిలో పెడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నా... భవిష్యత్తులో పిల్లలపై ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేయడం తప్పనిసరి. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో పిల్లల పెంపకానికి, ఆలనా పాలనా చూడటానికి రోజులో కొంత సమయం తప్పకుండా కేటాయించాల్సిందేనని నిపుణుల సూచన.
ఒక్కోదశలో ఒక్కోటి...
బుజ్జాయిలు ఒక్కో దశలో ఒక్కోటి నేర్చుకుంటూ ఉంటారు. తరుణంలో తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకుంటూ... సహకరించాలి. ఇది పిల్లల్లో సృజనాత్మకత పెరగడానికి దోహం చేస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వానికి అడుగులు పడతాయి. ఏది మంచి ఏది చెడు అనే భావనలు అర్థమవుతాయి. అదే వారిని సత్పప్రవర్తన వైపు అడుగులు వేయిస్తుంది...
పుట్టినప్పటి నుంచి ఏడాది దాకా...
సి పిల్లలు తొలిసారిగా నవ్వడం, అడుగులు వేయడం, వీడ్కోలు చెబుతూ చేతులు వూపడం వంటి నైపుణ్యాలను నేర్చుకుంటారు. తొలి ఏడాది మా..మా..డా..డా... అనే శబ్దాలు చేయడమే కాదు... వినడం, అర్థం చేసుకోవడం, మనుషులు, వస్తువుల పేర్లు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. దశలో పిల్లల మానసిక అభివృద్ధిలో భాగంగా తల్లితండ్రులతో ఒక రకమైన బంధం ఏర్పడుతుంది. బుజ్జాయిలను ప్రేమగా జోకొట్టడం, ఎత్తుకోవడం, లాలించడం వారితో ఆడటం పనులు చేయడం వల్ల అనుబంధాలకు పునాది పడుతుంది.
తల్లిదండ్రుల పాత్ర...
* పిల్లలతో మాట్లాడాలి. వారు మీ మాటలను గుర్తుపడతారు.
* చిన్నారులు వూసులాడుతున్నప్పుడు అవే శబ్దాలను మీరు ఉచ్చరించి కొత్త పదాలను వారికి పరిచయం చేయండి. ఇది వారిలో భాషాభివృద్ధికి తోడ్పడుతుంది.
* వారికోసం ఏదైనా చదివి వినిపించండి. భాషలోని శబ్దాలను, పదాలను అర్థం చేసుకోవడంలో ఉపకరిస్తుంది.
* పాటలు పాడి వినిపించడం, సంగీతం వినిపించడం ద్వారా వారికి సంగీతంపై ఇష్టాన్ని పెంచవచ్చు.
* ప్రేమను పంచి ఇవ్వడంతోపాటు వారిని ప్రోత్సహించాలి
* లాలించడం, ఎత్తుకోవడానికి తగినంత సమయం కేటాయించడం వల్ల పసివారు భద్రతాభావాన్ని పొందుతారు.
3 రెండు నుంచి మూడేళ్లు
వయసులో పిల్లల్లో స్వతంత్రంగా ఉండాలనే కోరిక వల్ల వీరిని అదుపుచేయడం కొంచెం కష్టతరమైన పని. అయినా సరే ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు ఎంతో ఉత్సుకతతో కూడిన సమయం. సమయంలో ఎంతో ఆలోచనా శక్తి, సామాజిక, మానసిక మార్పులను పొంది తమ చుట్టూ ఉన్న కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రదర్శిస్తారు. వస్తువులను, వాటి రంగు, ఆకారాన్ని బట్టి గుర్తించి వేరు చేయడం, పెద్దలను, తోటి చిన్నారుల్ని అనుకరిస్తారు. వివిధ రకాలైన మానసిక ఉద్వేగాలను ప్రదర్శిస్తారు.
తల్లిదండ్రుల పాత్ర...
* పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడానికి కొంత ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి.
* ఇతరులను అనుకరించడం వంటి ఆటలను పిల్లలతో ఆడించండి.
* పరిసరాలపై అవగాహన, పరిసరాలను గుర్తించి, పరిశోధించేలా వారిని విహార యాత్రలకు తీసుకెళ్లండి.
* వారి పేరు, వయసు ఇతరులను చెప్పేలా ప్రోత్సహించండి.
* చిన్న చిన్న పాటలను నేర్పించండి.
2 ఒకటి నుంచి రెండేళ్ల వరకు...
రెండేళ్ల వయసులో పిల్లలు బుడిబుడి అడుగులతో అటు ఇటు తిరగడమే కాకుండా తమపై, చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన పెంచుకుంటారు. కొత్త వస్తువులు, కొత్త వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. వయసులో పిల్లలు స్వతంత్రంగా ఉండటమే కాకుండా కొంత మొండి వైఖరి ప్రదర్శిస్తారు. అద్దంలో తమ ప్రతిబింబాన్ని గుర్తించడం, ముఖ్యంగా పెద్దవారిని, తమ కంటే పెద్ద పిల్లలను, తల్లిదండ్రులను అనుకరిస్తారు.
తల్లిదండ్రుల పాత్ర...
* చిన్నచిన్న కథలను చదివి వినిపించండి.
* వస్తువులను, శరీర భాగాలను గుర్తించాలని వారిని అడగండి.
* చిన్న పజిల్స్‌, వస్తువులను జతపరచడం, వివిధ ఆకారాలను గుర్తించడం తదితర ఆటలు బుజ్జాయిలతో ఆడాలి.
* కొత్త విషయాలను తెలుసుకునేలా ప్రోత్సహించాలి.
* వారు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటిని పదాల రూపంలో మార్చేందుకు సహకరించండి. సీసాను చూసి... సాసా అంటున్నప్పుడు... నువ్వు అంటున్నది సరైనదే- అది సీసా అంటూ కొత్త పదాన్ని పరిచయం చేయాలి.
* పిల్లలే స్వయంగా ఆహారం తీసుకునేలా, దుస్తులు వేసుకునేలా చూడాలి.
* నచ్చని ప్రవర్తన కారణంగా పిల్లల్ని దండించే బదులు... వారిలో మంచి లక్షణాలను, ప్రవర్తనను అభినందించాలి.
* పార్కు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి వస్తువులను, ప్రదేశాలను గుర్తుపట్టే సామర్థ్యాన్ని పెంచాలి.
4 మూడు నుంచి అయిదేళ్లలోపు...
వయసులో పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడతారు. బయట వ్యక్తులు, ఇతర పిల్లలతో కలిసి స్వతంత్రంగా ఉంటారు. తమ చుట్టూ ఉండే వస్తువుల గురించి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులతో సంబంధాలను బట్టి వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. దశలో సైకిలు తొక్కడం, కత్తెర ఉపయోగించడం, ఆడుకోవడం, కథలు గుర్తుపెట్టుకోవడం, పాటలు పాడటం వంటివి చేయగలరు.
తల్లిదండ్రుల పాత్ర...
* రకరకాలైన అంశాలు చదివి వినిపించాలి.
* చిన్న చిన్న పనుల్లో మీకు సహాయపడేలా ప్రోత్సహించాలి.
* ఇతర పిల్లలతో ఆడుకునేలా చేయండి. దీనివల్ల స్నేహం విలువ తెలుస్తుంది.
* పిల్లలను అదుపులో పెట్టేటప్పుడు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారి నుంచి తాము కోరుకునే ప్రవర్తనను వారికి తెలపండి.
* పిల్లల్లో భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించండి.
* స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా చేయాలి. దుస్తులు వేసుకోవాలి... ఎప్పుడు ఆడుకోవాలి... ఏది తినాలి...అనే అంశాలపై వారే ఎంపిక చేసుకునేలా సహకరించాలి.
మెలకువలు అవసరం
పిల్లల మనసు ఎంతో సున్నితం. ప్రతి విషయంలో తిట్టడం, దండించడం వల్ల వారి మానసిక, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దశలో కొన్ని మెలకువలు పాటించడం వల్ల వారిని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
* చిన్నారుల్లో స్వతంత్ర అభిప్రాయాలు, ఆలోచించే శక్తి ఉంటుందని విశ్వసించండి. మీ సొంత అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దే ప్రయత్నం వద్దు.
* వారి అభిరుచులను, నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించండి. వారిపై మీకు అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని పసివారు గుర్తించేలా చేయండి.
* మొక్కుబడిగా కాకుండా నాణ్యమైన సమయాన్ని వారితో గడపడానికి, వారి ఆసక్తులను గమనించడానికి కేటాయించాలి.
* పిల్లలు మంచి విలువలు నేర్చుకోవడానికి, మీరే ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవండి.
* మీరు తప్పు చేస్తే ఎలాంటి భేషజాలు లేకుండా పిల్లల నుంచి క్షమాపణ కోరాలి.
* మీ రోజువారీ అనుభవాలను పిల్లలతో పంచుకోవడానికి వారికి కొత్తకొత్త విషయాలు తెలిసేలా వివరించాలి.
* స్వవిషయాలను, మీ గత అనుభవాలను పిల్లలతో పంచుకోండి.
* పిల్లలు చేసే తప్పులకు వారినే బాధ్యత వహించేలా చేయాలి. అది వారికి కష్టంగా ఉన్నా... భవిష్యత్తులో మంచి, చెడుల విచక్షణను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుంది.

Comments

Popular posts from this blog

                                                                    hi I am DESHIKA.....