Skip to main content

Posts

Showing posts from October, 2017

తొలి అయిదేశ్లు.. వదలొద్దు ఆ లేత వేళ్లు!

తొలి అయిదేశ్లు .. వదలొద్దు ఆ లేత వేళ్లు ! పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి బుజ్జాయిల పెంపకంలో ఇదే కీలకం మానసిక , శారీరక ఎదుగుదలకు ముఖ్యం చిన్నారుల్లో నేర ప్రవృత్తికి అప్పుడే అడ్డుకట్ట రోజురోజుకూ పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి పరిసరాల ప్రభావమే కాదు ... చిన్నప్పటి నుంచి వారి పెంపకంలోని లోపాలు ... నిర్లక్ష్యం దోహదం చేస్తున్నాయి . ముఖ్యంగా ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు . ఈ నేపథ్యంలో పిల్లల పెంపకం ఓ సవాలుగా మారుతోంది . ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక పోతున్నారు . ఆ ప్రభావం చివరికి బుజ్జాయిలపై పడుతోంది . మరోవైపు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై ... ఆ స్థానంలో చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం పెరిగింది . ఈ పరిణామంతో పిల్లల పెంపకం కత్తి మీద సాములా మారింది . దీనికితోడు వృత్తి , వ్యక్తిగత ఒత్తిళ్లు పిల్లల పెంపకంపై పడి ... వారి మానసిక , శారీరక ఎదుగుదలకు ప్రతికూలంగా మారుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి . నగర జీవితం ఉరుకులు పరుగులమయం . నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయంతో భార్యాభ...